రామ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్!

రామ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్!

Published on Dec 5, 2015 1:27 PM IST

ram
‘శివమ్’ సినిమాతో మంచి హిట్ వస్తుందని ఆశించిన రామ్‌కు ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని తెచ్చిపెట్టకపోవడంతో తన కొత్త సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఆ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇక మొదట్లో ఈ సినిమాకు ‘హరికథ’ అన్న టైటిల్‌ను పరిశీలించిన సినిమా యూనిట్, తాజాగా ‘నేను.. శైలజ..’ అన్న పేరును తెరపైకి తెచ్చింది. ఇక ఈ ఉదయం సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తూ ‘నేను..శైలజ..’ అన్న పేరును ఫిక్స్ చేసేశారు.

హైద్రాబాద్‌లో రామ్, స్రవంతి రవికిషోర్, కిషోర్ తిరుమల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓ కూల్ లవ్‍స్టోరీగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని రామ్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను కొత్త సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేయాలని భావిస్తున్నట్లు నిర్మాత ఈ సందర్భంగా తెలిపారు. రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక నేడు విడుదలైన ఫస్ట్‌లుక్‌లో రామ్, కీర్తి సురేష్‌ల జంట చూడముచ్చటగా ఉండడంతో ఫస్ట్‌లుక్‌కు మంచి ఫీల్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు