రాజధానిలో పండగ చేస్కొంటున్న రామ్

రాజధానిలో పండగ చేస్కొంటున్న రామ్

Published on Sep 15, 2014 7:27 PM IST

ram-pothineni
యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పండగ చేస్కో’. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటి(సెప్టెంబర్ 15) నుండి హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.

ఈ సందర్భంగా నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. రామ్ చాలా స్టైలిష్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. మాస్ హీరోగా రామ్ ను ఆవిష్కరించే సినిమా ‘పండగ చేస్కో’ అవుతుంది. అతనికిది టైలర్ మేడ్ క్యారక్టర్. గోపీచంద్ మలినేని సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 15 నుండి హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ లో మరో షెడ్యూల్ ఉంటుంది. అని అన్నారు.

రామ్ సరసన సోనాల్ చౌహాన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు