పక్కా ప్లాన్‌తోనే సినిమా స్టార్ట్ చేసిన రామ్

పక్కా ప్లాన్‌తోనే సినిమా స్టార్ట్ చేసిన రామ్

Published on Oct 31, 2019 2:24 PM IST

red2

హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తర్వాత చాలా స్మార్ట్ అయ్యారు. ఎంచుకునే కథలు, దర్శకుల విషయంలోనే కాకుండా సినిమా విడుదల తేదీని ఎంచుకోవడంలో కూడా తెలివిని చూపించారు. తాజాగా మొదలుపెట్టిన ‘రెడ్’ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 9న విడుదలచేస్తామని నిన్న లాంఛ్ రోజునే అనౌన్స్ చేశారు. ఈ తేదీని సరిగ్గా పరిశీలిస్తే రామ్ తెలివి బయటపడుతుంది.

ఏప్రిల్ అంటే వేసవి సెలవులు ఆరంభమవుతాయి. ఇక 9వ తేదీ గురువారం, 10వ తేదీ శుక్రవారం గుడ్ ఫ్రైడే హాలీడే, ఇక శని, ఆదివారం ఎలాగూ వీకెండ్. ఇలా విడుదల తర్వాతా వరుసగా మూడు రోజులు కలిసొచ్చేలా ప్లాన్ చేశారు. సినిమా ఫస్ట్ డే టాక్ ఎలా ఉన్నా సెలవులు కాబట్టి 3 రోజులు వసూళ్ల రికవరీ బాగుంటుంది. ఇది నిర్మాతలకి సేఫ్ గేమ్.

అన్నట్టు ఈ చిత్రానికి నిర్మాత రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్. అందుకే ప్రాజెక్ట్ కనీసం మినిమమ్ గ్యారెంటీ అయ్యేలా రిలీజ్ డేట్ ప్లాన్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు