ఒక ఇంట్రెస్టింగ్, భారీ షెడ్యూల్ లోకి దిగిన “డబుల్ ఇస్మార్ట్”

ఒక ఇంట్రెస్టింగ్, భారీ షెడ్యూల్ లోకి దిగిన “డబుల్ ఇస్మార్ట్”

Published on May 4, 2024 1:00 PM IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ అండ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కనీసం ఒక్క అప్డేట్ వచ్చినా చాలు అనుకుంటున్నారు.

అయితే ఈ చిత్రం మధ్యలో ఎందుకో కొంచెం ఆలస్యం అయ్యింది. దీనితో అనుకున్న సమయానికి రిలీజ్ కి రాలేదు. అయితే ఫైనల్ గా ఓ సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ ఇప్పుడు అందించారు. ఓ భారీ షెడ్యూల్ అయితే తాము ముహూర్త కార్యక్రమాలతో నేడు ఆరంభించారు. ఆ మహా గణపతికి పూజలు జరిపి మొదలు పెడుతున్నట్టుగా ఛార్మి కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

అయితే సెట్స్ నుంచి వచ్చిన ఈ పిక్స్ చూసినట్టు అయితే ఇదేదో గ్రాండ్ షెడ్యూల్ లా కనిపిస్తుంది. చుట్టూ బ్లూ మ్యాట్ మ్యాట్ లు అవీ కనిపిస్తున్నాయి వీటితో అయితే గ్రాఫికల్ రిలేటెడ్ షెడ్యూల్ ని ఏమన్నా స్టార్ట్ చేసారా అనిపిస్తుంది. మరి చాలా కాలం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు అనుకునే ఫ్యాన్స్ కి ఇది కాస్త ఊరట అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు