కొత్త లుక్ లో అలరించడానికి సిద్ధమవుతున్న రామ్

ram

రామ్ త్వరలో ”బోల్ బచ్చన్’ తెలుగు రీమేక్ షూటింగ్ లో పాల్గొనున్నాడు. ఈ చిత్రానికి పేరు ఇంకా నిర్ధారించలేదు .వెంకటేష్,
రామ్ కలిసి తొలిసారిగా ఈ చిత్రంలో నటించనున్నారు. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, స్రవంతి రవి కిషోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటివలే రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ‘ఒంగోలు గిత్త’లో మెచ్యూర్డ్ లుక్ లో కనిపించిన అతను ఇందిలో మరింత విభిన్నంగా కనిపించనున్నాడు. “ఇంకా పేరుపెట్టని నా తాజా చిత్రంలో నేను క్లీన్ షేవ్ తో కనబడనున్నానని “ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఇదివరకు అతను నటించిన ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ కి అంత మంచి స్పందన రాలేదు. మరి రామ్ ఫాన్స్ ఈ కొత్త లుక్ ని ఎలా రిసీవ్ చేస్కుంటారో చూడాలి. ఈ సినిమా యొక్క మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version