వారియర్ గా రామ్…ఓ రేంజ్ లో ఉన్నాడుగా ..!

వారియర్ గా రామ్…ఓ రేంజ్ లో ఉన్నాడుగా ..!

Published on Jan 18, 2020 11:00 PM IST

హీరో రామ్ పోతినేని కొన్ని ఆసక్తికర ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.ఆ ఫోటోలలో యుద్ధ వీరులను తలపించే డ్రెస్సింగ్, చేతిలో వీర ఖడ్గం పట్టుకొని మోడరన్ వారియర్ లా ఉన్నాడు. ఐతే ఈ ఫొటోలన్నీ ఆయన నటించే సినిమాలోనివి అనుకుంటే పొరపాటే. ఓ ప్రైవేట్ ఫోటో షూట్ కొరకు రామ్ ఇలాంటి అద్భుతమైన ఫోజులిచ్చారు. గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ మూవీతో చాలా కాలం తరువాత ఓ క్లీన్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ చిత్రం 75కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించి రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం రామ్ ‘రెడ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ హిట్ మూవీ ‘తాడం’ కి తెలుగు రీమేక్ గా ఈచిత్రం తెరకెక్కుతుండగా రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. స్రవంతి క్రియేషన్స్ పతాకంపై స్రవంతి రవికిశోర్ తెరకెక్కిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది.

https://www.instagram.com/p/B7cts7flcw9/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు