ఇద్దరు డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్

ఇద్దరు డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్

Published on Dec 10, 2014 5:36 PM IST

Ram
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా చేస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే సంవత్సరం మొదట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తన తదుపరి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ముందుగా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రామ్ నటించబోయే సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు హైదరబాద్ లో జరిగాయి. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇది కాకుండా పలు చిత్రాలకు డైలాగ్ రైటర్, ‘సెకండ్ హ్యాండ్’ సినిమా డైరెక్టర్ కిషోర్ డైరెక్షన్ లో ఓ సినిమాకి సైన్ చేసాడు. ఇది కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. ప్రస్తుతం రామ్ చేస్తున్న ‘పండగ చేస్కో’ సినిమాకి గోపీచంద్ మలినేని డైరెక్టర్. రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు