డిజేగా కనిపించనున్న రామ్

ram
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తదుపరి సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలోని చివరి పాటని ఇటీవలే గోవాలో షూట్ చేసి షూటింగ్ ని ఫినిష్ చేసారు. రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ తో రానున్న ఈ సినిమాకి ‘నేను శైలజ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మేము మీకు తెలియజేయనున్నాం. రామ్ ఈ సినిమాలో నైట్ క్లబ్ లో పనిచేసే ఓ డిజేగా కనిపించనున్నాడు.

రామ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ ప్రకారం సినిమాని చాలా రియలిస్టిక్ గా ఉండేలా ప్లాన్ చేసాం. నేను నైట్ క్లబ్ లో పనిచేసే డిజేగా కనిపిస్తే, కీర్తి సురేష్ టిపికల్ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఈ సినిమాలో భారీ భారీ లొకేషన్స్ లో తీసిన సాంగ్స్ ఉండవు. అన్నీ కథలో భాగంగా చాలా రియలిస్టిక్ గా ఉంటయని’ రామ్ తెలిపాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డిసెంబర్ లో అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి 2016 జనవరి 1న ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత.

Exit mobile version