‘హలో గురు.. ‘ ఫై రామ్ ట్వీట్ !

‘హలో గురు.. ‘ ఫై రామ్ ట్వీట్ !

Published on Nov 18, 2018 1:20 AM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ ఇటీవల ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించి తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టి హిట్ సినిమా అనిపించుకుంది. అయితే రామ్ కు యూఎస్ లో మార్కెట్ లేకపోవడంతో అక్కడ ఈ చిత్రం నిరాశపరించింది. దాంతో ఈ చిత్రం రామ్ కు బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందించలేకపోయింది.

ఇక తాజాగా రామ్ ఈ సినిమా ఫై స్పందిస్తూ అనుకున్నంతగా మెప్పించలేకపోయిన సపోర్ట్ చేసి ఈ చిత్రాన్ని హిట్ చేసినందుకు ధన్యవాదాలు .. ప్రత్యేకంగా నా ఫాన్స్ కు కృతజ్ఞతలు. ఈ సారి వడ్డీ తో సహా తిరిగి ఇచ్చేస్తా అని ట్వీట్ చేశాడు. ఇక రామ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే తన 17వ సినిమాను పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు గా అనిపిస్తుంది. అయితే ఈ కొత్త చిత్రం గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ వెలుబడలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు