కమెడియన్ హనుమంతుడి వేషం వేశాడేంటీ..?

కమెడియన్ హనుమంతుడి వేషం వేశాడేంటీ..?

Published on Sep 4, 2019 11:54 PM IST

లియో సెల్యులాయిడ్, క్రొకోడైల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాతలు ఫణి క్రాంత్ , విశాలక్ష్మీ మంద నిర్మిస్తున్న చిత్రం రామ చక్కని సీత. దర్శకుడు శ్రీహర్ష మంద ఈ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. కాగా ఈ చిత్ర ట్రైలర్ రేపు విడుదల చేయనున్నారు. ఈమేరకు చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేశారు.

భక్తుడి గెటప్ లో ఉన్న ప్రియదర్శి కూర్చొని గుండెలు చీల్చి హీరో, హీరోయిన్ల ఫోటోను చూపిస్తున్న ఆ పోస్టర్ రామ భక్తుడు హనుమాను ని తలపిస్తుంది. పోస్టర్ పై క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా “వాస్తవ సంఘటనల ఆధారంగా, రామాయణం వాస్తవం ఐతే” అని వేయడం జరిగింది. ప్రేమికుల మధ్య రాయబారం నడిపే మెసెంజర్ గా ప్రియదర్శి కీలకపాత్ర చేస్తున్నాడని పోస్టర్ చుస్తే అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు