‘రంగస్థలం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ సంక్రాంతి కానుకగా జనవరి 11న ‘వినయ విధేయ రామ’ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం నుండి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ‘రామ లప్స్ సీత’ వీడియో సాంగ్ ప్రోమో విడుదల అయింది. సాంగ్ చాలా కలర్ ఫుల్ గా చక్కాగా ఉంది. సాంగ్ లో చరణ్ డాన్స్ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి.
ఇక ‘రామ లప్స్ సీత’ పాటను శ్రీమణి రాయగా.. సింగర్స్ సింహ, ప్రియా హిమేష్ పాడారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ కథానాయికగా నటించగా వివేక్ ఒబేరాయి ప్రతినాయకుడి పాత్రను పోషించారు. దానయ్య డివివి ఈ సినిమాని నిర్మించారు.
సాంగ్ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


