లిరిసిస్ట్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్

Ramana-Gogula

గతంలో ‘ప్రేమంటే ఇదేరా’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘లక్ష్మీ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల గత కొంత కాలంగా సినిమాలు ఏమీ చేయలేదు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘1000 అబద్దాలు’ సినిమాకి రమణ గోగుల సంగీతం అందిస్తున్నాడు. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ద్వారా రమణ గోగుల లిరిసిస్ట్ గా మారనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ పాటని రాసాడు. ఆ పాట నచ్చడంతో తేజ కూడా పచ్చజెండా ఊపారు. సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని పి. సునీత నిర్మిస్తున్నారు.

Exit mobile version