చమ్మక్ చంద్ర హీరో లుక్ లో కేకపుట్టిస్తున్నాడుగా.

చమ్మక్ చంద్ర హీరో లుక్ లో కేకపుట్టిస్తున్నాడుగా.

Published on Sep 7, 2019 5:47 PM IST

తెలుగు రాష్ట్రాలలో జబర్ధస్త్ గురించి, అందులోని నటుల గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు కామెడీ షో లలో ఒక ట్రెండ్ సెట్టర్ గా జబర్ధస్త్ మిగిలిపోయింది. ఈ షోతో పాపులర్ అయిన షకలక శంకర్ హీరోగా కూడా మారగా మహేష్,ధన్రాజ్, చంటి, రాఘవ, ఆది, రామ్ ప్రసాద్, గెటప్ శీను వంటి వారు తెలుగు చిత్రాలలో మంచి పాత్రలు దక్కించుకుంటున్నారు. ఇక జబర్ధస్త్ లో మరో ఫేమస్ ఆర్టిస్ట్ అయిన చమ్మక్ చంద్ర కూడా అనేక తెలుగు సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో కనిపిస్తున్నాడు.

ఐతే ఆయన కూడా రామ సక్కనోళ్లు చిత్రంతో హీరోగా మారనున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ తెలంగాణా తెరాస నేత హరీష్ రావు చేతుల మీదుగా ఈనెల 9న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. సతీష్ కుమార్ సట్పాడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం ఫహీమ్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మనందం, బ్రహ్మజీ, నాగినీడు, చలపతి రావు, ధన్రాజ్, జయప్రకాష్ రెడ్డి,సాయాజీ షిండే వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు