‘రామ్ లీల’ ఆడియో రిలీజ్ డేట్

‘రామ్ లీల’ ఆడియో రిలీజ్ డేట్

Published on Feb 3, 2015 6:00 PM IST

ramleela
హవీష్, అభిజిత్, నందిత నటినటులుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రామ్ లీల’. కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు చిన్నా సంగీతం అందించారు. షూటింగ్, నిర్మాణంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమా ఆడియోను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. సినిమాను ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మలేసియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగు తెరపై వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఈ తరహా ప్రేమకథను తెరకెక్కించడం ఇదే మొదటిసారి. హవీష్, అభిజిత్ ల పాత్రలు చాలా బాగుంటాయి. ఎస్. గోపాల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలుస్తుంది. అని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అన్నారు.

తాజా వార్తలు