
సత్యదేవ దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న సినిమా ‘లయన్’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.
గత ఏడాది మార్చిలో ‘లెజెండ్’తో భారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలకృష్ణ. ఈ సంవత్సరం కూడా హిట్ సెంటిమెంట్ ఫాలో అవుతూ.. ‘లయన్’ సినిమాను మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 28న ‘లయన్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. ఈ రెండు సినిమాలలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘లయన్’ సినిమాకు రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలో నిర్మాణంతర కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.