రామ్ నెక్స్ట్ సినిమా టైటిల్ ‘శివం…. శివోహం’..?

రామ్ నెక్స్ట్ సినిమా టైటిల్ ‘శివం…. శివోహం’..?

Published on Feb 3, 2015 12:45 AM IST

ram
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పండగ చేస్కో’ చిత్రీకరణలో యువ హీరో రామ్ బిజీగా ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత సురేందర్ రెడ్డి శిష్యుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాను రామ్ హోం బ్యానర్ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

మొదట ఈ సినిమాకు ‘శివం’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా శ్రీ స్రవంతి మూవీస్, ఫిల్మ్ ఛాంబర్ లో ‘శివం…. శివోహం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. ఈ టైటిల్ పలువురిలో ఆసక్తి రేపింది. కథ ఎలా ఉండబోతుంది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. రామ్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదే కావొచ్చని ఫిల్మ్ నగర్ ప్రముఖులు భావిస్తున్నారు.

తాజా వార్తలు