మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలను ముగించుకొని విడుదలకు సిద్దమవుతుంది ఈ చిత్రం. ఇక ఈచిత్రం యొక్క టీజర్ ను రేపు విడుదల చేస్తుండగా చిత్రాన్ని ఆగష్టు 31న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.
ఈచిత్రంలో శైలజా రెడ్డి అనే ముఖ్య పాత్రలో నాగ చైతన్య అత్త గా నటించింది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. ఈ పాత్రలో నటించినందుకు గాను ఆమె రోజుకు 6లక్షల పారితోషికాన్ని తీసుకున్నారట. దాదాపు ఈ చిత్రానికి ఆమె 22 రోజుల పనిచేశారట ఆలెక్కన ఆమె భారీ పారితోషికాన్ని తీసుకుందని తెలుస్తుంది. ఇక ఆమె ఈచిత్రం తో ఇపుడున్న అక్కినేని హీరోల అందరితోను నటించింది. నాగార్జున తోని గతంలో చాలా చిత్రాల్లో నటించిన రమ్య కృష్ణ, అఖిల్ తో ‘హలో’ అనే చిత్రంలో ఆయనకు తల్లి గా నటించింది.


