ఊహించని పాత్రలో రమ్యకృష్ణ !

ఊహించని పాత్రలో రమ్యకృష్ణ !

Published on Jan 18, 2019 8:15 PM IST

వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ మరో సారి ఊహించని పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో ‘సూపర్ డీలక్స్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో రమ్య కృష్ణ శృంగార తార గా నటిస్తుంది. అయితే ఈ పాత్రకు మొదటగా నదియా ను తీసుకుందామనుకున్నాడట డైరెక్టర్ అది వర్క్ అవుట్ కాకపోయేసరికి రమ్య కృష్ణ ను ఓకే చేశారని సమాచారం. 2004లో వచ్చిన సునామి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , సమంత , ఫహద్ ఫాసిల్ , మిస్కీన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి ఎస్ వినోద్ , నిరవ్ షా సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. కుమార్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మూడు గంటల నిడివితో ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు