ఆకాష్ పూరికి తల్లిగా నటిస్తోందా ?

ఆకాష్ పూరికి తల్లిగా నటిస్తోందా ?

Published on Mar 26, 2020 10:00 PM IST

ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం రమ్యకృష్ణ ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అలాగే ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. ఈ రొమాంటిక్ మూవీలో బాలీవుడ్ నటి మందిరా బేడీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే మరో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు