‘రొమాంటిక్’గా రీషూట్ చేస్తోన్న రమ్యకృష్ణ !

‘రొమాంటిక్’గా రీషూట్ చేస్తోన్న రమ్యకృష్ణ !

Published on Nov 7, 2019 2:00 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’. కాగా నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం రమ్యకృష్ణ ప్లేస్ లో మందిరా బేడి ఆల్ రెడీ నటించిందట. కానీ ఆ సీన్స్ బాగా రాకపోవడంతో ఇప్పుడు మందిరా బేడి ప్లేస్ లో రమ్యకృష్ణను పెట్టి ఆ సీన్స్ ను రీషూట్ చేస్తున్నారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు