క్రికెటర్ శ్రీశాంత్‌కు తల్లిగా నటించనున్న రమ్యకృష్ణ!

క్రికెటర్ శ్రీశాంత్‌కు తల్లిగా నటించనున్న రమ్యకృష్ణ!

Published on Sep 19, 2015 1:00 PM IST

Ramya_Krishna
క్రికెటర్‌గా కెరీర్లో ఊహించని పరిణామాలతో అనిశ్చితి వచ్చాక కొన్నాళ్ళకు ఆ ఫీల్డ్‌కు గుడ్‌బై చెప్పిన శ్రీశాంత్, సినిమాల ద్వారా కొత్త కెరీర్‌కు ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే! ఆ క్రమంలోనే శ్రీశాంత్ ఓ బహుభాషా చిత్రంలో నటించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. సానా యాదిరెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న ఈ సినిమాలో శ్రీశాంత్, ఓ క్రికెటర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించనున్నారనే వార్త హల్‌చల్ చేస్తుండగా, తాజాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీ రోల్ చేయనుండడం విశేషంగా కనిపిస్తోంది.

తెలుగులో గతంలో టాప్ హీరోయిన్‌గా చలామణీ అయిన రమ్యకృష్ణ, ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ పలు కీలక పాత్రల్లో మెప్పిస్తున్నారు. బాహుబలితో రమ్యకృష్ణ రేంజ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక శ్రీశాంత్ నటించబోయే సినిమాలో రమ్యకృష్ణ, శ్రీశాంత్‌కు తల్లిగా, ఓ ఇండిపెండెంట్ విమెన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు