డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన రానా !


గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో స్టార్ నటుడు రానా కూడా ఉన్నారని, కానీ పలుకుబడి కలిగి ఉండటం ఆయన పేరు బయటకురాకుండా చేస్తున్నారని, పోలీస్ శాఖ నుండి ఆయనకు కూడా నోటీసులు అందాయని ఆరోపణలు వచ్చాయి. తాజగా నేషనల్ మీడియాతో మాట్లాడిన రానా ఈ ఆరోపణలపై స్పందించారు.

‘రోజూ 20 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ శరీరాకృతిని మైంటైన్ చేయడానికి మంచి ఫుడ్ డైట్ పాటిస్తూ వర్కవుట్స్ చేస్తాను, అందువలనే ఇంత ఫిట్ గా ఉన్నాను. ఒకవేళ డ్రగ్స్ వాడే వాడినైతే నాకివన్నీ సాద్యమా మీరే ఆలోచించండి’ అంటూ ఆ వార్తలను ఖండించారు. మరోవైపు ఆయన తండ్రి సురేష్ బాబు కూడా తమ పిల్లలపై వస్తున్నవన్నీ ఒట్టి పుకార్లేనని ఆ వార్తలను కొట్టిపడేశారు. ఇక ఎవరి పేర్లైతే బయటికొచ్చాయో వారంతా ఈ నెల 20వ తేదీ నుండి రోజుకొకరు చొప్పున వరుసగా సిట్ టీమ్ విచారణను ఎదుర్కోనున్నారు.

Exit mobile version