రానా, ప్రియదర్శి కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

రానా, ప్రియదర్శి కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

Published on Apr 28, 2024 1:05 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో ప్రియదర్శి కూడా ఒకడు. పలు చిత్రాల్లో కీలక పాత్రలతో సహా హీరోగా కూడా తాను పలు చిత్రాలు వెబ్ సిరీస్ లలో మెప్పించాడు. మరి గత ఏడాది వచ్చిన “బలగం” తో భారీ హిట్ అందుకున్న తాను ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో రాబోతున్నాడు. రీసెంట్ గా “ఓం భీం బుష్” లో సాలిడ్ రోల్ పోషించిన తాను నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి అలాగే జాన్వీ నారంగ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

స్పిరిట్ మీడియా, ఎస్ వి ఏ సి ఎల్ ఎల్ పి వారి సమర్పణలో తెరకెక్కించనున్నారు. మరి ఈ సినిమా అనౌన్సమెంట్ పోస్టర్ లో థ్రిల్లు ప్రాప్తిరస్తు అంటూ ఓ లైన్ సినిమా నేపథ్యాన్ని చెప్తుంది. ఇక ఈ చిత్రంపై మరిన్ని డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి రిలీజ్ కి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు