జైన్ట్ మోన్స్టర్ లుక్ లో రానా దగ్గుబాటి

Rana Daggubati

2010లో మొదలైన హౌస్ ఫుల్ మూవీ సిరీస్ లో భాగంగా తెరకెక్కిన హౌస్ ఫుల్ 4 చిత్ర ట్రైలర్ నేడు విడుదల చేయడం జరిగింది. మూడు ప్రేమ జంటల మధ్య రెండు భిన్న కాలాలలో జరిగే గజిబిజి గందర గోళంమే హౌస్ ఫుల్4 చిత్రం అని అర్థం అవుతుంది. హౌస్ ఫుల్ సక్సెస్ సిరీస్ లో కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్,కృతి సనన్, రితేష్ దేశముఖ్, బాబీ డియోల్, కృతి కర్బంద, పూజ హెగ్డే నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో రానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ లో ఆయన లుక్ చూసిన ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. హాలీవుడ్ సినిమాలలో భారీ రాక్షసులను పోలిన లుక్ లో ఉన్న రానా ఆసక్తిగొలుపుతున్నారు. రాజుల కాలంలో జైన్ట్ మోన్స్టర్ పాత్ర రానా చేశారు. ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ ఫిలిమ్స్, మరియు సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది దీపావళి కానుకగా హౌస్ ఫుల్ 4 విడుదల కానుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version