విభిన్న చిత్రాలు తీసే రవిబాబు డైరెక్టర్ గా తీసిన ‘అవును’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘అవును 2’ రూపొందించే పనిలో రవిబాబు ఉన్నాడని ఇది వరకే తెలియజేశాం. మొదటి పార్ట్ లో హర్షవర్ధన్ రాణే – పూర్ణ జంటగా నటించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సీక్వెల్ లో ప్రధాన పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నాడు. కానీ ఈ వార్తలపై ఇంకా ఎలాంటి కచ్చితమైన ప్రకటన లేదు.
అలాగే ఈ సినిమాని సురశ్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు నిర్మించనున్నాడని సమాచారం. గతంలో కూడా రవిబాబు ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై అవును సినిమా తీసాడు కానీ అది నచ్చి సురేష్ ప్రొడక్షన్స్ – పివిపి వాళ్ళు కలిసి ఈ సినిమాని కొనుక్కున్నారు. కానీ ఈ సారి సురేష్ బాబు డైరెక్ట్ ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


