దగ్గుబాటి రానా ఆరోగ్యంపై కొన్ని రోజులుగా పరిశ్రమలో కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చికిత్స కోసం అమెరికా వెళ్లారని,వాళ్ళ అమ్మగారు కిడ్నీని సర్జరీ ద్వారా ఆయనకి అమర్చారని పలురకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో రానా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నకు రానా సమాధానం చెప్పారు .
మీకు శస్త్ర చికిత్స జరిగిందంట కదా ఆరోగ్యం ఎలా ఉంది? అని ఆ నెజిటన్ ప్రశ్నించగా, ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు,అలాంటి వార్తలను చదవకండి అని అన్నారు. ఇక మరో నెటిజన్ మరి మీరు ఎందుకు బరువు తగ్గిపోతున్నారు? అని అడగ్గా, ఎప్పుడూ రాక్షసుడిగా ఉండలేను కదా,అని చమత్కరించారు.సినిమా కొరకు తప్పించి ఎప్పడూ భారీ కాయంతో రాక్షసుడిలా ఉండాల్సిన అవసరం ఏముంది అన్నట్లుగా ఆయన సమాధానం చెప్పారు.
నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు,పుకార్లు నమ్మకండి అని రానా తన అభిమానులకు తీపికబురు పంపారు. రానా ప్రస్తుతం విరాటపర్వం,హాథీ మేరీ సాథీ, హౌస్ ఫుల్ 4 తో పాటు మరో రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో కొన్ని చిత్రీకరణ దశలో ఉండగా, మరికొన్ని మొదలుకావాల్సివుంది.