దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ విడుదలై అంతటా సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ సినిమా ద్వారా ఇప్పటికే తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, విభిన్న పాత్రలతో మెప్పించిన రానా తన రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బాహుబలి రానాకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పటివరకూ బాహుబలి కోసం కష్టపడుతూ వచ్చిన రానా, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కొన్నాళ్ళ పాటు సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు.
ఇక బాహుబలి సక్సెస్‌ను ఇలా ఎంజాయ్ చేయడం పూర్తైందో, లేదో వెంటనే బెంగళూర్ డేస్ తమిళ్ రీమేక్ కోసం సిద్ధమైపోయారు. చెన్నైలో జరుగుతున్న షూటింగ్‌లో రానా తన పార్ట్‌ను కంటిన్యూ చేయనున్నారు. మళయాలంలో ఘన విజయం సాధించిన బెంగళూర్ డేస్ తమిళ్ రీమేక్‌లో రానా ఓ పాత్రలో కనిపిస్తున్నారు. పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్య, శ్రీ దివ్య, బాబీ సింహ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


