టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో
రెండు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొండుతుండడం విశేషం. అవే ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’. ఇప్పటికే రుద్రమదేవి షూటింగ్ పూర్తి కాగా బాహుబలి ప్రస్తుతం సెట్స్ పై ఉంది.
రానా బాహుబలి గురించి మాట్లాడుతూ ‘నా జర్నీ మొత్తం ఒక ప్రయోగం. ప్రస్తుతం అలానే వెళ్తున్నాను. ప్రస్తుతం ఒక బిగ్గెస్ట్ ప్రయోగం చేస్తున్నాను. అదే రాజమౌళి చేస్తున్న బాహుబలి. ఇదొక పీరియడ్ వార్ ఫిల్మ్. నాకు బాగా నచ్చిన జోనర్’ అని రానా అన్నాడు.
ప్రస్తుతం బాహుబలికి గ్యాప్ ఇచ్చిన రానా పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. నిన్ననే సీమా అవార్డ్స్ ఈవెంట్ ని ఫినిష్ చేసిన రానా హిందీలో నటిస్తున్న బేబీ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. అందుకోసం ప్రస్తుతం అబుదాబి వెళ్తున్నాడు. బాహుబలి సినిమాలో రానా ప్రభాస్ కి బ్రదర్ గాకనిపించనున్నాడు.


