తమిళంలో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న రానా

తమిళంలో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న రానా

Published on Nov 30, 2011 9:51 AM IST


రెండు సంవత్సరాల క్రితం రానా తెలుగులో ‘లీడర్’ చిత్రంతో అడుగుపెట్టారు. ఇప్పుడు తమిళనాట అడుగు పెట్టడానికి రంగం సిద్ధమైంది. గతంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒక చిత్రం చేయాల్సిన ప్రాజెక్ట్ కొన్ని కారణాల వాళ్ళ రద్దయింది. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందబోయే “వాడ చెన్నై’చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నాడు. శింబు మరియు ఆండ్రియా ఇతర ముఖ్య పాత్రలో నటించనున్నారు.

క్లౌడ్ నైన్ మూవీస్ బ్యానర్ పై దయానిధి అలగిరి నిర్మించనున్నారు. గతంలో వెట్రి మారన్ రూపొందించిన ‘ఆడుకలాం’ చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రానికి మరికొన్ని నేషనల్ అవార్డులు కూడా లభించాయి. వెట్రి మారన్ ఆడుకలాం చిత్రం తరువాత తెరకెక్కిన్చబోయే వాడ చెన్నై చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు