అక్షయ్ కుమార్, దగ్గుబాటి రానా, తాప్సీ ప్రధాన పాత్రలలో నటించిన హిందీ సినిమా ‘బేబీ’. హిందీలో సినిమా విడుదలకు కనీసం 15 రోజుల ముందు నుండి భారి ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే కోవలో జనవరి 23న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల జోరును పెంచారు నటీనటులు మరియు దర్శకనిర్మాతలు.
ప్రస్తుతం ‘బేబీ’ సినిమా ప్రమోషన్ నిమిత్తం రానా, తాప్సీలు బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ‘స్పెషల్ 26’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు నీరజ్ పాండే, అక్షయ్ కుమార్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రానాలు బ్లాక్ కమాండోలుగా నటించారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలు పెంచింది.


