బిపాసా బసుతో రెండోసారి – రానా దగ్గుబాటి.

బిపాసా బసుతో రెండోసారి – రానా దగ్గుబాటి.

Published on Nov 8, 2014 11:21 PM IST

rana-bipsa-basu

‘దం మరో దం’ సినిమా తర్వాత రానా దగ్గుబాటి, బిపాసా బసు కలసి ‘ఎన్.ఐ.ఏ’ సినిమాలో నటించనున్నారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ తాజా సినిమాకు విక్రమ్ ఫడ్నిస్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా వివరాలను నేడు ముంబైలో వెల్లడించారు. త్రీ ఏజస్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకేక్కబోయే ఈ సినిమాకు శంకర్ ఎసహాన్ లాయ్ త్రయం సంగీతం అందించనున్నారు.

అక్షయ్ కుమార్ ‘బేబీ’ సినిమాలో రానా కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ ఇటివలే కంప్లీట్ అయ్యింది. తెలుగులో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సినిమాలన్ని 2015లో విడుదలవుతాయి. మొత్తానికి 2015 రానాకు చాలా కీలకంగా మారింది. ప్రతి సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది.

తాజా వార్తలు