‘బాహుబలి’ కోసం ఫస్ట్ అవార్డు గెలుచుకున్న భళ్ళాలదేవ

rana1
‘బాహుబలి’ అనే సినిమా ఈ ఏడాది ఎన్నో రికార్డ్స్ ని సృష్టించడమే కాకుండా చాలా మంది నటులకు, డైరెక్టర్ మరియు టెక్నీషియన్స్ కి నేషనల్ లెవల్లో గుర్తింపును తెచ్చి పెట్టింది. దానికి కారణం మునుపెన్నడూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించని ఓ అద్భుత పీరియడ్ ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం. ఈ క్రెడిట్ దర్శకధీరుడు రాజమౌళికి దక్కుతుంది. కలెక్షన్స్ వర్షాన్ని ముగించిన ఈ సినిమా ప్రస్తుతం వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సందడి చేస్తోంది. అది పక్కన పెడితే.. ఈ సినిమాలో బాహుబలి అనే పాత్రకి గట్టి పోటీని ఇచ్చే భళ్లాలదేవ పాత్రలో రానా దగ్గుబాటి అద్భుతమైన నటనని కనబరిచాడు. రానా పెర్ఫార్మన్స్ కి అందరి నుంచి ప్రశంశలు దక్కాయి.

తాజాగా రానా ప్రశంశలతో పాటు బాహుబలి సినిమాలో చేసిన భళ్లాలదేవ పాత్రకి గాను మొట్ట మొదటి అవార్డుని అందుకోనున్నాడు. అది కూడా ఆసియాలోనే ప్రతిష్టాత్మకమైన ఆసియా విజన్ మూవీ అవార్డ్స్-2016లో రానాకి అవార్డు దక్కడం విశేషం. ఈ అవార్డు వేడుక డిసెంబర్ 2న దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. రానా ఇదే విషయాన్ని ట్విట్టర్ లో తెలియజేస్తూ, తన ఆనందాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం రానా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. జవరి నుంచి రానా ‘బాహుబలి 2’ షూట్ లో పాల్గొంటాడు.

Exit mobile version