‘గ్యాంగ్ స్టర్’ శర్వానంద్ కెరీర్ లోనే హైలెట్ !

Published on May 28, 2019 4:00 am IST

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల కాంబినేషన్ లో దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం లో శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’గా కనిపించనున్నాడు. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట.అలాగే ఎమోషన్స్ తో కూడినదై ఉంటుందని శర్వానంద్ కెరీర్ లోనే ఈ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతున్నారు.

కాగా ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కధ కధనాలు ఈ చిత్రంలో హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

సంబంధిత సమాచారం :

More