
టాలీవుడ్ లో ఆరడుగుల హీరోగా తెలుగుతెరపై తనకంటూ ఒక ఇమేజ్ ని సంతరించుకున్న నటుడు దగ్గుబాటి రానా. ఈ హంక్ తెలుగు ప్రేక్షకులనే కాక బాలీవుడ్ వాసులను సైతం మెప్పిస్తున్నాడు. ”దమ్ మారో దమ్”,”ఏ జవాని ఏ దివానీ”, ‘డిపార్ట్మెంట్’ సినిమాలలో కీలకపాత్రలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించిన ”బేబీ”లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. పలువురు ప్రముఖులకు, మీడియాకు వేసిన ప్రత్యేక షోకి మంచి ప్రశంసలు అందుతున్నాయి.
ఈ సినిమాలో తాప్సీ, అనుపమ్ ఖేర్ మరియు డ్యాన్నీలు నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాను గతంలో ‘వెడ్నస్ డే’, ‘స్పెషల్ 26’ వంటి సినిమాలను తెరకెక్కించిన నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. ఈ నెల 23న ఈ చిత్రం మనముందుకు రానుంది.
ఈ వేసవిలో రానా బాహుబలి, రుద్రమదేవి వంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వున్న చిత్రాలతో మనముందుకు రానున్నాడు.

