
హెండ్సం హంక్ రాణా టాలీవుడ్ కే కాక బాలీవుడ్ కి సుపరిచుతుడు. రోహన్ సిప్పీ ‘దం మారో దం’ తో బాలీవుడ్ అరంగ్రేటం ఇచ్చిన రాణా ఆర్. జి. వి ‘డిపార్ట్మెంట్’ మరియు ‘యే జవాని హై దివానీ’ లాంటి చిత్రాల్లో నటించాడు. తాజా గా ‘బేబీ’ అనే ఇంకో హింది చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం లో ఒక పవర్ ఫుల్ కౌంటర్ ఇంటలిజెన్స్ వింగ్ ఏజెంట్ గా కనిపిస్తాడు. ఈ చిత్రం లో అక్షయ్ కుమార్ అనుపమ్ ఖేర్ డెన్నీ మరియు మన తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
‘బేబీ’ ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల కానుంది. ‘ఎ వెడ్నెస్ డే’ ‘స్పెషల్ 26’ చిత్రాల దర్శకుడు నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘బేబీ’ చిత్రం ఇండియా లో టెర్రరిజానికి వ్యతిరేకంగా సాగే ఒక యాక్షన్ థ్రిల్లర్.
టి-సిరీస్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఆగష్టు లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మంచి స్పందన ని రాబట్టుకుంది. ప్రేక్షకులలో ఆశక్తి ని పెంచింది.

