మంచు లక్ష్మి సినిమాలో రానా అతిధి పాత్ర..

మంచు లక్ష్మి సినిమాలో రానా అతిధి పాత్ర..

Published on Dec 27, 2014 11:29 AM IST

rana_manchu_lakshmi
వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో దగ్గుబాటి రానా అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఇటివలే ఆ పాత్రకు సంబంధించి చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. చాలా చిన్న పాత్రయినా, కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలో రానా కనిపిస్తారు. ఎవరైనా స్టార్ హీరో ఈ పాత్రలో నటిస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారు. రానాను కలసి ఆ సినిమాలో పాత్ర ప్రాముఖ్యత వివరించగానే, మరో ఆలోచన లేకుండా రానా వెంటనే అంగీకరించారు. ఇటివలే హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేశారు. అని రానా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో మంచు లక్ష్మికి జోడిగా అడవి శేష్ నటిస్తున్నారు.

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన మరో సినిమా ‘బుడుగు’ విడుదలకు సిద్దమయింది. ‘పిలవని పేరంటం’ అనే మరో సినిమాలో నటిస్తుంది. వైవిధ్యమైన కథలను ఓకే చెప్తూ కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది.

తాజా వార్తలు