రానా సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్

rana1
కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ సినిమాలను అటెంప్ట్ చేస్తూ వస్తున్న రానా దగ్గుబాటి ఈ ఏడాది బాహుబలి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అలాగే హీరోగా ఓ డిఫరెంట్ సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఇండియన్ స్క్రీన్ పై రాని నేవీ, సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో రానా డబ్బుబాటి సినిమా చేయనున్నాడు. 1971 లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ లో పాకిస్తాన్ వాళ్ళు విశాఖపట్నంలోని పిఎన్ఎస్ ఘజి సబ్ మెరైన్ పై దాడి చేసి అది సముద్రంలో మునిగిపోయేలా చేసారు. ఈ వీడని మిస్టరీనే ఈ సినిమా కథాంశం. సంకల్ప్ అనే రైటర్ ఈ కథని సిద్దం చేసుకొని తనే దర్శకుడుగా ఈ సినిమా చేస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ మేజర్ పార్ట్ ని ఎక్కువగా అండర్ వాటర్ లో షూట్ చేయాల్సి ఉంటుంది. దానిని రియల్ గా షూట్ చేయడం కష్టం కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ తో క్రియేట్ చేయనున్నారు. ఈ చిత్ర టీం దాదాపు 20% ని విజువల్ ఎఫెక్ట్స్ తో డిజైన్ చేయనుంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ విజువల్ ఎఫెక్ట్స్ పై వర్కౌట్ చేస్తోంది. రానా నావికా అధికారిగా కనిపించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్నాడు. ఈ సినిమాలో రానాకి జోడీగా సొట్ట బుగ్గల సుందరి తాప్సీని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘ఘజి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

Exit mobile version