మార్చిలో రానా తమిళ సినిమా..?

మార్చిలో రానా తమిళ సినిమా..?

Published on Nov 11, 2014 3:17 AM IST

rana
హీరోగా కెరీర్ ప్రారంభించిన దగ్గర నుండి ఒక ప్రణాళిక ప్రకారం సినిమాలు చేసుకుంటూ వస్తున్న హీరో రానా దగ్గుబాటి. కేవలం ఏదో ఒక భాషకు పరిమితం అయిపోవాలని రానా అనుకోవడం లేదు. అదే సమయంలో హీరో పాత్రల కోసం పట్టుబట్టడం లేదు. తెలుగు, హిందీ, తమిళ సినిమాలలో కథలో కీలకమైన పాత్రల చేయడానికి కూడా రెడీ అంటున్నాడు.

అజిత్ ‘ఆరంభం’తో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన రానా, వచ్చే ఏడాది మరో తమిళ సినిమాలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ‘ఇటివలే ఒక తమిళ సినిమా స్క్రిప్ట్ విన్నాను, నచ్చింది. దాదాపు ఖరారు చేసినట్టే. 2015 మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాను. అని రానా చెప్పారు.

తెలుగులో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాలలో నటిస్తున్నాడు. హిందీలో ‘బేబీ’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. ‘ఎన్.ఐ.ఏ’ మరో సినిమాను అంగీకరించాడు. ఈ సినిమాలో రానా, బిపాసా జంటగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు