తెలుగు హీరోలు నో చెప్పిన కథతో రణబీర్ !

Ranbir Kapoor

‘అర్జున్‌ రెడ్డి’ లాంటి ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డితో సినిమా చేయటానికి టాలీవుడ్ బడా హీరోలందరూ క్యూ కట్టారు. ఆ నేపథ్యంలో మొదటగా ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా ఉండబోతుందని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ బాలీవుడ్ నుండి అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఆఫర్ రావటంతో సందీప్ ముంబై చెక్కేసాడు. అయితే మహేష్ కి కథ నచ్చకపోవటంతో కొన్ని మార్పులు చేయమని సూచించారట. వాటికి తగ్గట్టుగా మార్పులు చేసి వినిపించినా మహేష్ సముఖతగా లేకపోవటంతో అదే కథని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరకు తీసుకెళ్లగా , బన్నీ కూడా నో అన్నారట.

అయితే, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ‘యానిమల్ ‘ సినిమా చేస్తున్నట్లుగా అధికారక ప్రకటన రావటంతో టాలీవుడ్ లో ఈ సినిమా మీద అనేక చర్చలు జరుగుతున్నాయి.టాలీవుడ్ ఇద్దరు హీరోలు నో చెప్పిన కథతోనే సందీప్ రెడ్డి ఆ సినిమా చేస్తున్నారన్న వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ పక్కన మొదటి సారి పరిణీతి చోప్రా కథానాయికగా నటించబోతుంది. ఈ ప్రాజెక్ట్‌ని పాన్ ఇండియా మూవీగా చేద్దామని సందీప్ ఎంతగా ట్రై చేసినా మన తెలుగు హీరోలు ముందుకు రాకపోవటంతో ఫైనల్ గా ఈ సినిమా పై రణబీర్ ఓకే చేయటంతో సందీప్ మూడో మూవీ కూడా హిందీలోనే చేస్తున్నాడు.

Exit mobile version