అలియా సపోర్ట్ తోనే ఆ సీన్స్ చేశా – రణబీర్

అలియా సపోర్ట్ తోనే ఆ సీన్స్ చేశా – రణబీర్

Published on Jan 21, 2024 10:58 PM IST

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ కలయికలో వచ్చిన ‘యానిమల్’ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. ఐతే, మోతాదుకు మించిన ఇంటిమేట్‌ సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయని విమర్శలు ఎక్కువ వినిపించాయి. ఐతే, అన్ని ప్రాంతాల ప్రేక్షకులు యానిమల్ సినిమాను మాత్రం చాలా బాగా ఆదరించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని ఇంటిమేట్‌ అండ్ హింసాత్మక సన్నివేశాల్లో నటించడం పై హీరో రణ్‌ బీర్‌ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇంతకీ, హీరో రణ్‌ బీర్‌ ఏం కామెంట్స్ చేశాడంటే.. ‘యానిమల్ చిత్రంలోని ఇంటిమేట్‌ అండ్ హింసాత్మక సన్నివేశాల్లో నటించడానికి నేను మొదట చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. ముఖ్యంగా కెరీర్‌ పరంగా నాకు చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాను. కానీ నా భార్య అలియా భట్‌ మాత్రం చాలా ఎంకరేజ్‌ చేసింది. ఆమె ప్రోత్సాహంతోనే నేను ఇంటిమేట్‌ సన్నివేశాల్లో నటించాను’ అంటూ రణ్‌ బీర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు