‘రామాయణ’ రన్ టైం లాక్?

‘రామాయణ’ రన్ టైం లాక్?

Published on Oct 14, 2026 2:00 AM IST

బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్, సాయి పల్లవి లీడ్ నటులుగా యష్ విలన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన భారీ ఇతిహాస కావ్యం ‘రామాయణ’ కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఒకో క్రేజీ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా గ్రాండ్ విడుదలకి సిద్ధం అవుతుంది.

మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా మొదటి భాగం తాలూకా రన్ టైం పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా మొత్తం 3 గంటల 15 నిమిషాల మేర నిడివితో రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ మూడుంపావు గంటల సేపు గ్రాండ్ విజువల్ ట్రీట్ ని ఈ సినిమా అందించనుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంకి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే నమిత మల్హోత్రా, యష్ లు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు