‘రంగ్ దే’ ట్రైలర్ టాక్ : ఫన్ ఫ్యాక్టర్ మెండుగా ఉంది

‘రంగ్ దే’ ట్రైలర్ టాక్ : ఫన్ ఫ్యాక్టర్ మెండుగా ఉంది

Published on Mar 19, 2021 7:42 PM IST

rangde 4

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. మార్చి 26న రిలీజ్ కానుంది. అందుకే చిత్ర బృందం ఈరోజు ట్రైలర్ వదిలారు. ట్రైలర్ చూస్తే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేలా ఉంది. ప్రధానంగా హీరో హీరోయిన్ల పాత్రలు ఫన్నీగా, లవ్లీగా ఉన్నాయి. కీర్తి సురేష్ గతంలో ఎన్నడూ ఇలాంటి క్యారెక్టర్ చేసింది లేదు. అందుకే చాలా కొత్తగా కనిపిస్తోంది.

చిన్నప్పటి నుండి హీరోను ఇబ్బందిపెట్టే కొంటె అమ్మాయి పాత్రలో కీర్తి బాగా కుదిరింది. నితిన్ తో ఆమె కెమిస్ట్రీ బాగా సెట్టైంది. కొత్త జంటను చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. వెంకీ అట్లూరి సినిమాలు అన్నింటిలో మంచి ప్రేమ కోణం ఉంటుంది. అలాగే ఇందులో కూడ నితిన్, కీర్తిల మధ్యన మంచి లవ్ ట్రాక్ ఉన్నట్టే కనిపిస్తోంది. వన్ లైన్ పంచులు, ఇన్నోసెంట్ క్యారెక్టర్లు ట్రైలర్ నిండా కనిపిస్తున్నాయి. చూస్తుంటే సినిమా అంచనాలను అందుకునేలా ఉంది. మొత్తానికి ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచిందనే అనాలి. తార ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.డి.వి.ప్రసాద్ సమర్పకులు. సుప్రసిద్ధ డీవోపీ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు