‘రంగమార్తండ’ పనుల్ని చకచకా కానిస్తున్న కృష్ణవంశీ

‘రంగమార్తండ’ పనుల్ని చకచకా కానిస్తున్న కృష్ణవంశీ

Published on Dec 30, 2019 9:45 AM IST

krishna vamsi

సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ త్వరలో ‘రంగమార్తాండ’ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని కృష్ణవంశీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నటీనటుల నుండి అన్ని విషయాల్లో సినిమా గొప్పగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సంగీతాన్ని ఇళయరాజాగారి చేత చేయించుకుంటున్నారు.

గతంలో ఇళయరాజాగారితో 1998లో వచ్చిన ‘అంత:పురం’ సినిమాకి మ్యూజిక్ చేయించుకున్న కృష్ణవంశీ మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం కృష్ణవంశీ చెన్నై వెళ్లారు. అక్కడి అడయార్ పార్కులో కంపోజింగ్ చేయనున్నారు. 2017 తర్వాత ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి నిర్మిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష రాజ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు