అమెజాన్ రిలీజ్ ‘రంగస్థలం’ వసూళ్లఫై ప్రభావం చూపలేదు !
Published on May 17, 2018 4:21 pm IST

‘రంగస్థలం’ సినిమా కలెక్షన్స్ పరంగా నాన్ ‘బాహుబలి’ రికార్డులని బద్దలు కొట్టి దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ రేపటితో 50 రోజులను పూర్తిచేసుకోనుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.120 కోట్ల షేర్, రూ.200 కోట్లకు పైగానే గ్రాస్ ను రాబట్టుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు బి, సి సెంటర్ల నుండి కలెక్షను రాబడుతోంది.

ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఆన్ లైన్లో ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉండడటంతో కలెక్షన్స్ ఫై ప్రభావం పడుతుందని అభిమానులు కొంత కంగారు పడ్డారు. కానీ ప్రైమ్ లో రిలీజ్ చేసినా కూడ ప్రేక్షకులు చిత్రాన్ని థియేటర్లలో చూడడానికే ఇష్టపడుతుండడంతో ఈ చిత్ర కలెక్షన్లకి ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook