తెలుగు సినిమా కలెక్షన్ల రికార్డుల గురించి మాట్లాడుకునేప్పుడు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్స్ కూడ ప్రస్తావనకు రావాల్సిందే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏదైనా చిత్రం మంచి రన్ చూపించిందంటే అది ఖచ్చితంగా నైజాం ఏరియాలో విజయం సాధించినట్టేననేది లెక్క. ప్రస్తుత విషయానికొస్తే రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘రంగస్థలం’ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ ప్రధాన థియేటర్ గా ప్రదర్శింపబడుతోంది.
ఇప్పటి వరకు ఈ చిత్రం ఆ థియేటర్ ద్వారా దగ్గర దగ్గర రూ. 2 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇంతకు ముందు ‘బాహుబలి, బాహుబలి-2’ చిత్రాల పేరిట ఆ రికార్డ్ ఉండగా వాటి తర్వాత మూడవ స్థానాన్ని చరణ్ చిత్రం ఆక్రమించింది. త్వరలోనే 50 రోజుల రన్ ను పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం అనేక చోట్ల నాన్ బాహుబలి రికార్డుల్ని సృష్టించింది.
ఓవర్సీస్లో సైతం 3.5 మిలియన్ డాలర్ మార్కును దాటిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగానే గ్రాస్ ను రూ.120 కోట్ల పై చిలుకు షేర్ ను వసూలు చేసింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
