మిలియన్ మార్క్ దాటేసిన ‘రంగస్థలం’ !

భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1700 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన వసూళ్లను సాదించడమేగాక ఓవర్సీస్లో సైతం దుమ్మురేపే కలెక్షన్స్ రాబట్టుకుంది.

ప్రీమియర్ల ద్వారానే హాఫ్ మిలియన్ కొల్లగొట్టిన ఈ చిత్రం తొలిరోజు ముగిసేసరికి 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది. ఈ లెక్కలతో యూఎస్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 5వ స్థానంలో నిలిచిందీ చిత్రం. ఇక ఈరోజు రేపటితో ఈ సినిమా రెండు మిలియన్లను కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.