మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీ నుంచి విషెష్ వెల్లువెత్తుతుండడంతో పాటుగా తన సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర అప్డేట్స్ కూడా వస్తున్నాయి. మరి ఇదిలా ఉండగా ఇప్పటికే “RRR” మరియు “ఆచార్య” చిత్రాల నుంచి సాలిడ్ అప్డేట్స్ ను విడుదల చేసారు. అయితే చరణ్ ఇప్పటి వరకు చేసిన ఎన్నో సినిమాల్లో తన బెస్ట్ ఇచ్చిన సినిమా ఏది అంటే నిర్మొహమాటంగా “రంగస్థలం” అనే అంటారు అంతా..
మరి ఈ భారీ హిట్ చిత్రాన్ని నిర్మాణం వహించిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఇదే చిత్రంపై ఓ వార్త కోసం చెప్పారు. తమిళ నాట పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఈ చిత్రం తమిళ్ వెర్షన్ ను వచ్చే మే నెలలో చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. మరి చరణ్ మరియు సుకుమార్ ల కాంబోలో వచ్చిన ఈ వింటేజ్ వండర్ అక్కడ ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి. మరి ఈ చిత్రంలో చరణ్ సరసన సమంతా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ అవుట్ స్టాండింగ్ సంగీతం అందించాడు.
Wishing our Mega Power Star a great day! #HappyBirthdayRamcharan
Due to Popular demand by all #RamCharan Tamil Fans.. We are releasing Blockbuster Rangasthalam (Tamil) in Theatres this MAY 2021.. Release thru @7GfilmsSiva@AlwaysRamCharan @Samanthaprabhu2 @ThisIsDSP @aryasukku pic.twitter.com/TIaYiZtgH5
— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2021

