ఇతర రాష్ట్రాల్లో కూడ చిట్టిబాబు హవా గట్టిగా పనిచేస్తోంది !

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఒపెనింగ్స్ తో పాటు మొదటి మూడు రోజులకుగాను దాదాపు రూ.37 కోట్లకు పైగానే షేర్ ను అందుకున్న ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో కూడ మంచి వసూళ్లను రాబడుతోంది. మెగా హీరోలకి మంచి ఫాలోయింగ్ ఉన్న కర్ణాటకలో ఈ చిత్రం మూడు రోజులకుగాను రూ.4.8 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

అలాగే తమిళనాడు చెన్నై నగరంలో ఆదివారం ఒక్కరోజే రూ.23 లక్షల గ్రాస్ ను రాబట్టి మూడు రోజులకుగాను రూ.70 లక్షల గ్రాస్ ను నమోదుచేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ తరహాలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల సినిమా సంతృప్తికరమైన కలెక్షన్స్ రాబడుతూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, ఆది పినిశెట్టి, అనసూయలు పలు కీలక పాత్రల్లో నటించారు.