మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న రంగస్థలం 1985 సినిమా నుండి మూడు పాటలు విడుదల అయ్యాయి. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ లభించడం విశేషం. ఈ నెల 18 న వైజాగ్ ఆర్ కె బీచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేసారు చిత్ర యూనిట్. ఈ ఫంక్షన్ లో కొన్ని అంశాలు హైలెట్ కాబోతున్నాయని సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్ళితే..
మొదటిది దేవి శ్రీ ప్రసాద్ లైవ్ పర్ఫామెన్స్. దేవి మ్యూజిక్ చేసిన దాదాపు అన్ని సినిమా ఫంక్షన్స్ లో దేవి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తాడు. అలాగే బుర్ర కథ, తప్పెట గాళ్ళు, చోడవరం డప్పు అని మూడు విభిన్న అంశాలు ఈ వేడుకలో హైలెట్ కాబోతున్నాయని సమాచారం. సినిమా పల్లెటూరు నేపద్యంలో నడిచే కథ కావున ఈవెంట్ లో అందరికి నచ్చే విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్.
