ఓవర్సీస్లో బలంగా కొనసాగుతున్న ‘రంగస్థలం’ వసూళ్లు !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అసామాన్య నటనతో ‘రంగస్థలం’ చిత్రాన్ని విజయ తీరాలకు చేర్చిన సబంగతి తెలిసిందే. మొదటిరోజు హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచే దిశగా వెళుతోంది. ఓవర్సీస్లో అవలీలగా 2.5 మిలియన్లను అందుకున్న ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బద్దలుకొట్టే దిశగా దూసుకుపోతోంది.

బుధవారం 62,000 డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా 2.69 మిలియన్లను ఖాతాలో వేసుకుంది. ఈ రన్ చూస్తే సినిమా ఇంకో రెండు మూడు రోజుల్లో 3 మిలియన్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.